శేరిలింగంపల్లి, మే 2 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ కి చెందిన త్రివేణి హై స్కూల్ విద్యార్థులు 10 వ తరగతి పరీక్షా ఫలితాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పతకాలతో అభినందించి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ 10 వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను అని, 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రతి ఒక్కరు ఒక లక్ష్యం ఏర్పరచుకొని లక్ష్యం దిశగా అడుగులు వేసి లక్ష్యాన్ని చేరుకోవాలని, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదు అని , ప్రయత్నిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవడం సులభతరం అని , మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని తల్లిదండ్రులకు , సమాజంకు ఉపయోగపదేవిధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.