హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే జన్మభూమి గొప్పదనే నమ్మకంతో దేశ రక్షణ కై పోరాడి దేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ ర్యాడ మహేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ ప్రవీణ్ రెడ్డి మరణించడం పట్ల హైదర్‌నగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు నార్నె శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధులుగా మహేశ్, ప్రవీణ్ చరిత్రలో నిలిచిపోతారని అని ఆయన వ్యాఖ్యానించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద వీర జవాన్ల చిత్రపటాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, కోనేరు కృష్ణ ప్రసాద్, జనరల్ సెక్రటరీ కృష్ణ ముదిరాజ్, వార్డ్ మెంబర్ శ్రీకాంత్, ఏరియా కమిటీ మెంబర్ పర్వీన్ సుల్తానా, నాయకులు ఆశ్రాఫ్, సత్యనారాయణ, సద్దాం, సత్తార్, అనిల్, కాలనీ వాసులు అజయ్, లక్ష్మణ్, ఫణి పాల్గొన్నారు.