శేరిలింగంప‌ల్లిలో జోరుగా అభివృద్ధి పనుల‌కు శంకుస్థాప‌న‌లు

కొండాపూర్/గ‌చ్చిబౌలి/శేరిలింగంప‌ల్లి‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో రూ.18 కోట్ల 43 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో క‌లిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధ‌వారం శంకుస్థాప‌న‌లు చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ A, B బ్లాక్, మార్తాండ నగర్, రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వర కాలనీ, కొత్తగూడ విలేజ్, శ్రీ రామ్ నగర్ A బ్లాక్, అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, PJR నగర్, సైబర్ హిల్స్, మస్తాన్ నగర్ లలో చేపట్టబోయే సీసీ రోడ్లు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వారు శంకుస్థాప‌న‌లు చేశారు.

కొండాపూర్ డివిజ‌న్‌లో అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ అధికారి డీఈ రమేష్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, తెరాస సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, కొండాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు అబ్బుల కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, వార్డు మెంబర్స్ రూప రెడ్డి, గౌరీ, నిర్మల, శ్రీనివాస్ చౌదరి, జంగం గౌడ్, నరసింహ సాగర్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె బలరాం యాదవ్, వైస్ ప్రెసిడెంట్స్ రాజేష్ యాదవ్, గఫుర్, రఘు, భీమని శ్రీనివాస్, ఏరియా కమిటీ మెంబర్స్ తిరుపతి యాదవ్, హిమామ్, మంగమ్మ, కరీం, విజయ్, మహేందర్, తెరాస నాయకులు సైబర్ హిల్స్ భాస్కర్ రెడ్డి, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, న్యూ పీజేఆర్ న‌గ‌ర్‌ ప్రెసిడెంట్ వెంకటి, అల్తాఫ్, రజనీకాంత్, నందు, అబేద్ అలీ, దామోదర్, గిరి, వెంకటేశ్వర్లు, డా.రమేష్, గిరి గౌడ్, సత్యం గౌడ్, సయ్యద్ ఉస్మాన్, సాగర్, గణపతి, బాబా, చారీ, పద్మశ్రీ, హినాయత్, యూత్ నాయకులు దీపక్, రఫీ, నరేష్ ముదిరాజ్, వినయ్, అంజాద్ అమ్ము, లావణ్య, నసీరుద్దీన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

గ‌చ్చిబౌలిలో…
గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలో రూ.1 కోటి 78 లక్షల 27 వేల అంచనా వ్యయం తో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. డివిజన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ కాలనీ, నల్లగండ్ల హుడా కాలనీ, లక్ష్మి విహార్ ఫేజ్ – 1 లలో చేపట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనులకు ఆయ‌న శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, విశ్వనాథ్‌, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, సురేష్ గౌడ్, చెన్నం రాజు, నరేష్, సత్యనారాయణ, దాసరి గోపి కృష్ణ, భూషణ్, వసంత కుమార్, యాదగిరి, జగదీశ్, సలావుద్దీన్, సత్యనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్, శ్రీకాంత్, వినోద్, రామేశ్వరమ్మ, అంజమ్మ, విజయ పాల్గొన్నారు.

శేరిలింగంప‌ల్లిలో…
శేరిలింగంపల్లి డివిజన్ ప‌రిధిలో రూ.12 కోట్ల 30 లక్షల 55 వేల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో క‌లిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. డివిజన్ పరిధిలోని తారానగర్, వెంకట్ రెడ్డి కాలనీ, పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్, గోపి నగర్, నెహ్రు నగర్, ప్రశాంత్ నగర్, ఆదర్శ్ నగర్, భాగ్య నగర్ కాలనీ, శ్రీ రామ్ నగర్ A , B , C బ్లాక్ లలో చేపట్టబోయే సీసీ రోడ్లు, సీసీ రోడ్ల పునరుద్ధరణ నిర్మాణ పనులకు వారు శంకుస్థాప‌న‌లు చేశారు.

శేరిలింగంప‌ల్లి డివిజ‌న్‌లో అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డీఈ శ్రీనివాస్, ఏఈ సునిల్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు యాదగిరి, మహేష్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, డివిజ‌న్ తెరాస అధ్యక్షుడు ‌రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, తెరాస నాయకులు ఉరిటి వెంకటరావు, ఉపాధ్యక్షులు యాదాగౌడ్, కుంచం రమేష్, వార్డు మెంబర్లు కవితా గోపి, పొడుగు రాంబాబు, ఫర్వీన్, రాములు, తుల్జాభవాని ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున శర్మ, సభ్యులు గోవింద్ చారి, రవీందర్, నాయకులు రాగం అనిరుద్ యాదవ్, రవీందర్ యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, కలివేముల వీరేశం గౌడ్, నట్ రాజ్, జ్యోతి, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, అర్జున్ రావు, ప్రకాష్ చారి, భీం రెడ్డి, కృష్ణ, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గఫర్, కిరణ్, హోప్ ఫౌండేషన్ చైర్మ‌న్‌ కొండా విజయ్ కుమార్‌, పాపిరెడ్డినగర్ కాలనీ అధ్యక్షుడు బద్దం కొండల్ రెడ్డి, సందయ్యనగర్ కాలనీ అధ్యక్షుడు బసవరాజు, లింగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రవియాదవ్, గోపీనగర్ కమిటీ గౌరవ అధ్యక్షుడు గోపాల్, నెహ్రూ నగర్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, శ్రీ రాం నగర్ అసోసియేషన్ ‌అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here