శేరిలింగంపల్లి, నవంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ ని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, సందన వేణి మహేందర్ యాదవ్ సన్మానించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీల పట్ల అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రావలసిన వాటా, విద్యా, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో తెలంగాణ, కర్ణాటక, భారతదేశవ్యాప్తంగా జనాభా దామాషా పద్ధతిలో వాటా కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన అణగారిన వర్గాలు పోరాడుతున్నారన్నారు. వాటా కోసం కేంద్రంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా గొర్రెల మేకల పెంపకం అధ్యక్షుడు మధు యాదవ్, శేరీలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందెలా సత్యనారాయణ యాదవ్, మైనార్టీ సంఘం ముస్తఫా, అశోక్ ముదిరాజ్, రజక సంఘం కృష్ణ, కుమ్మరి సంఘం దేవేందర్, బీసీ నాయకులు పాల్గొన్నారు.