శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యంగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృదే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతూ తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి కాలనీ, బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని తెలిపారు.
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనాగూడ సాయి కాలనీలో స్థానిక నాయకులతో పర్యటించి నూతనంగా నిర్మించాల్సిన సీసీ రోడ్డును పరిశీలించారు. అనంతరం స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకుడు ప్రభాకర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ శ్రీహరి గౌడ్, ఆశీల శివ కుమార్, ప్రసాద్, కిషోర్, రవి, భాను, చలపతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.