శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు గాంధీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
మహాత్మా గాంధీకి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాళి…
జాతిపిత, బాపూజీ, మహాత్మాగాంధీ 73వ వర్ధంతి సందర్భంగా తన నివాసంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతోపాటు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు సంజీవ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, లక్ష్మారెడ్డి, మల్లికార్జున్ శర్మ, దొడ్ల రామకృష్ణ గౌడ్, కొమ్మగల్ల మోజేష్, నటరాజ్, వాసుదేవ రావు, విజయమ్మ, బాలస్వామి, గుడ్ల శ్రీనివాస్, నిమ్మగళ్ల అర్జున్, నల్లోల్ల రాము, అనంతయ్య, ఆదర్శ్, సంకి సత్యం, రమేష్, మీరయ్య పాల్గొన్నారు.


శేరిలింగంపల్లిలో…
అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 2 నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొండల్ రెడ్డి, ఆంజనేయులు, పట్లోళ్ల నర్సింహారెడ్డి, శ్రీకాంత్, విజయలక్ష్మి, అరుణ, శృతి పాల్గొన్నారు.

మియాపూర్‌లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో గాంధీ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

హఫీజ్‌పేటలో…
హఫీజ్‌పేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో గాంధీ వర్ధంతి సందర్బంగా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సృజన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పర్శ్ పేరిట కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్ బాబు, ఏపీఎంవో రమేష్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.


ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…
మాదాపూర్ లోని సాయినగర్ లో ఉన్న స్వాతి హైస్కూల్ ఆవరణలో గాంధీ విగ్రహానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఫణికుమార్, సభ్యులు శివరామకృష్ణ, విష్ణుప్రసాద్, నల్లగొర్ల శ్రీనివాస్, పాలం శ్రీను, శ్రీదేవి పాల్గొన్నారు.

మదీనాగూడలో…
మదీనాగూడలో ఉన్న గాంధీ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాల్ రాజ్, మల్లేష్, వేణు గౌడ్, శివ ముదిరాజ్, రవి, జనార్దన్ పాల్గొన్నారు.

చందానగర్‌లో…
చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్‌లో ఉన్న గాంధీ విగ్రహానికి డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లేష్ గుప్తా, లక్ష్మీ నారాయణ గౌడ్, జనార్దన్ రెడ్డి, సుప్రజ ప్రవీణ్, నరేంద్ర భల్లా, మిరియాల ప్రీతం, యూసుఫ్ పాషా, దాస్, కొండల్ రెడ్డి, విజ్ఞేష్, రాహుల్, వెంకటేష్, కుమార్ యాదవ్, బాబులు, రాజు గౌడ్ పాల్గొన్నారు.

మక్తా మహబూబ్ పేటలో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో గాంధీ విగ్రహానికి బీజేపీ నాయకుడు రవి కుమార్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మక్తా గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాఘవేంద్ర రావు, సమ్మెట ప్రసాద్, గుండె గణేష్ ముదిరాజ్, మల్లేష్, రవీందర్, శ్రీను, బాబు ముదిరాజ్, శివ రాజు ముదిరాజ్, రాము, నరేష్, ప్రతాప్, రాజేందర్, రమేష్, వినోద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సోను యాదవ్, శ్రీశైలం పాల్గొన్నారు.

