గోపినగర్ కాలనీ బ్లాక్-10లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని విన‌తి

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప‌రిధిలోని వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని గోపినగర్ కాలనీ బ్లాక్-10 మహిళలు శ‌నివారం కలిశారు. ఈ సంద‌ర్భంగా వారు త‌మ బ్లాక్ లో నెల‌కొన్న‌ రోడ్డు, డ్రైనేజీ సమస్యలను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ కార్పొరేట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె. రత్నమ్మ, ఎం. పావని, టి. సక్కుభాయ్, శోభ, సత్తమ్మ, నిర్మల, లక్ష్మీ, బాలమణి, శాంత, కైరున్ బేగం, ఎస్‌.లక్ష్మీ, సుజాత పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న గోపినగర్ కాలనీ బ్లాక్-10 మ‌హిళ‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here