శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): డా.బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో ఉన్న డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నడిగడ్డ తాండ వాసులు, స్థానిక నాయకులతో కలసి డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందుతున్నాయంటే అది బి ర్ అంబెడ్కర్ మనకు కల్పించిన హక్కు అని అన్నారు. దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రచించిన మేధావి అని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, సీనియర్ నాయకులు మర్రపు గంగాధర్ రావు, శివ, అడ్డు, అవినాష్, నడిగడ్డ తాండ వాసులు నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామినాయక్, శంకర్ నాయక్, రత్నాకర్, రెడ్యానాయక్, హనుమంత్ నాయక్, దశరథ్, సుధాకర్, కమలాకర్, సీతారాం, లక్పతి, లక్ష్మణ్, తిరుపతి, గోపి, అబ్రహాం, సోమేష్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.