నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్ల పరిధిలో విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం అల్విన్ కాలనీలోని ట్రాన్స్ కో ఏడీ కార్యాలయంలో డీఈ గోపాల కృష్ణ కలిశారు. డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. నూతన విద్యుత్ స్తంభాలు, కేబుల్, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ నాయకులు నరేందర్ గౌడ్, ఏడీ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.