నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ గా నియమితులైన డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావును, సభ్యులుగా నియమితులైన కిశోర్ గౌడ్, ఉపేంద్ర లను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు మంగళవారం ఘనంగా సత్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉపాధ్యక్షుడు రాములు సగర, రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మర్క సురేష్ సగర, మహిళా నాయకురాళ్లు మణిమంజరి సగర, పల్లవి సగర, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి సగర, ఉపాధ్యక్షుడు శ్రీరాములు సగర, నాయకులు బాల్ రాజ్ సగర, రాచాల శ్రీనివాస్ సగరలు హాజరై కమిషన్ కమిటీ సభ్యులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.