శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోట్ల రహదారులకు మరమ్మత్తులు నిర్వహించినట్లు స్థానిక ట్రాఫిక్ సీఐ తెలిపారు. మియాపూర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద రహదారులపై పడిన గుంతలను ఈ సందర్భంగా పూడ్చి వేశామని, పలు చోట్ల మరమ్మత్తులు చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నట్లు వివరించారు.






