శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): క్రైమ్ డైరీస్ న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో D. S. P. బంటు రాములు ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ క్రైమ్ డైరీస్ ఛానల్ కు పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్లు వివరించారు. చానల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక సేవే లక్ష్యంగా చానల్‌ను నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐడి డి.ఎస్.పి రాములు, కడుమూర్ అడ్వకేట్ ఆనందం, జై భీమ్ ఛానల్ అధినేత డాక్టర్ శివ, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, చంద్రశేఖర్ యాదవ్, లింగం తదితరులు పాల్గొన్నారు.






