టీపీయూఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పండగ

నమస్తే శేరిలింగంపల్లి:టీపీయూఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డికి, టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములుకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కెసిఆర్ కె దక్కిందన్నారు. పేద కుటుంబాలకు చెంది‌న ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళ, ఆసరా పింఛన్లు, మహిళ రక్షణ కోసం షీ టీమ్స్, మహిళ డ్వాక్రా మహిళల రుణాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం మహిళ లోకానికి శ్రీ రామ రక్షా అని కొనియాడారు. రాఖీ పండుగను పుర్కరించుకుని మహిళ లోకానికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభా రెడ్డి, ఉపాధ్యక్షురాలు శ్రావణి రెడ్డి, భవాని, వరలక్ష్మి, భాస్కర్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కి రాఖీ కడుతున్న టీపీయూఎస్ రాష్ట్ర మహిళా విభాగం
టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గందం రాములు కు రాఖీ కడుతున్న మహిళా విభాగం నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here