నమస్తే శేరిలింగంపల్లి: రాఖీ పౌర్ణమి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు బ్రహ్మకుమారీస్ సంస్థ సభ్యులు రాఖీ కట్టి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. నల్లగండ్ల లోని నివాసంలో కార్పొరేటర్ ని కలిసిన బ్రహ్మకుమారీస్ సంస్థ సభ్యులు బి.కె. అరుంధతి, సోనాలి, నర్సయ్య కలిసి రాఖీలు కట్టారు. రాఖీ అనగా రక్షణ బంధం, ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అని అన్నారు. సోదరులు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.