శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గురువారం ఉదయం మియాపూర్ బాచుపల్లి రోడ్డు లక్కీ రెస్టారెంట్ బాలాజీ నగర్ వద్ద ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతుడి వయస్సు సుమారుగా 50 సంవత్సరాల వరకు ఉంటుందని, అతను యాచకుడు అయి ఉంటాడని, బహుశా అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా అతన్ని గుర్తు పట్టదలిస్తే 8712663179 అనే నంబర్‌కు ఫోన్ కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.