గ‌చ్చిబౌలి టిమ్స్ వ‌ద్ద క‌రోనా రోగుల‌ బంధువుల‌కు ఆర్‌కేవై ప్రాణ‌హేతు భోజ‌నం పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ర‌వికుమార్ యాద‌వ్‌(ఆర్‌కేవై) ప్రాణ‌హేతు ఆద్వ‌ర్యంలో గ‌చ్చిబౌలి టిమ్స్ ద‌వాఖానా వ‌ద్ద క‌రోనా రోగుల కుటుంబ స‌భ్యుల‌కు, బంధువుల‌కు గురువారం ఉచితంగా భోజ‌నం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌కేవై ప్రాణ‌హేతు ప్ర‌తినిధి గుండె గ‌ణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న నేపథ్యంలో ప్ర‌భుత్వ ద‌వ‌ఖానాల‌లో చికిత్స పొందుతున్న రోగుల‌కు, అక్క‌డకు వ‌చ్చే వారి బంధువుల ఆక‌లి తీర్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు తెలిపారు. అదేవిధంగా నిరుపేద‌లు నివ‌సించే బ‌స్తీల్లోను భోజ‌నం పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. త‌మ బృందం సేవ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న బిజెపి రాష్ట్ర నాయ‌కులు రవికుమార్ యాద‌వ్‌కు వారు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉచిత భోజ‌నం సౌక‌ర్యం కోసం ఫోన్ నెంబ‌ర్ 7901629623లో సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌కేవై ప్రాణ హేతు బృంద స‌భ్యులు గుండె గ‌ణేష్ ముదిరాజ్‌, వినోద్ యాద‌వ్‌, జాజీరావు, రాము, శ్రీను, చంద్ర‌మాసిరెడ్డి, సోను కుమార్‌యాద‌వ్‌, సాయి, బాల‌రాజు సాగ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

క‌రోనా రోగి కుటుంబ స‌భ్యుల‌కు భోజ‌నం పంపిణీ చేస్తున్న ఆర్‌కేవై ప్రాణ‌హేతు బృందం ప్ర‌తినిధి గుండె గ‌ణేష్ ముదిరాజ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here