కోవిడ్ ర‌క్ష టీమ్‌కు బిజెపి ద‌ళిత మోర్చ రాష్ట్ర‌ అధికార ప్ర‌త‌నిధి కాంచ‌న కృష్ణ‌ చేయూత

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కరోనా కష్ట కాలంలో శేరిలింగంపల్లి 106 డివిజన్‌లో రాజు శెట్టి కురుమ అధ్వర్యంలో కోవిడ్ రక్ష టీమ్ చేస్తున పనులను తెలంగాణ రాష్ట్ర బీజేపీ దళిత మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ ప్ర‌త్యేకంగా అభినందించారు. త‌న‌ వంతు సహాయంగా హోమ్ శానిటైజేషన్ మెషీన్‌ని కాంచ‌న కృష్ణ కోవిడ్ ర‌క్ష టీమ్‌కు అంద‌జేశారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో యువ‌త సేవ‌చేసేందుకు ముందుకు రావ‌డం ఇత‌రుల‌కు స్పూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. వాడ‌వాడ‌ల కోవిడ్ ర‌క్షా టీమ్‌లు ఏర్పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కోవిడ్ ర‌క్షా టీం స‌భ్యులు సత్య కుర్మా, ఎళ్లేష్ కురుమ, సాయి, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ ర‌క్ష టీమ్‌కుహోమ్ శానిటైజేషన్ మెషీన్‌ని అంద‌జేస్తున్న కాంచ‌న కృష్ణ‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here