శేరిలింగంప‌ల్లి జంట స‌ర్కిళ్ల‌లో ప‌క‌డ్భందీగా సూప‌ర్‌స్ప్రెడ‌ర్స్ వ్యాక్సినేష‌న్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి, చందాన‌గ‌ర్ జంట స‌ర్కిళ్ల‌లో ఏడ‌వ రోజు సూప‌ర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ య‌దావిథిగా కొన‌సాగింది. చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియంలో 18 ఏళ్ల పైబ‌డిన వారు 593 మంది, 45 ఏళ్లు పైబ‌డిన వారు 158 క‌లిపి మొత్తం 751 మందికి కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఐతే ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ నేప‌థ్యంలో సిబ్బంది ప‌క‌డ్భందీగా వ్య‌వ‌హ‌రించ‌డంతో వ్యాక్సిన్ కోసం వ‌చ్చిన ప‌లువురు సామాన్యులు వెనుదిరిగారు. ఈ క్ర‌మంలో గ‌త ఆరు రోజుల‌తో పోలిస్తే పీజేఆర్ స్టేడియం ప్రాంగ‌ణం వెల‌వెలబోయింది. గ‌చ్చిబౌలి సంధ్య క‌న్వెన్ష‌న్‌లో 18 ఏళ్ల పైబ‌డిన వారు 550 మంది, 45 ఏళ్లు పైబ‌డిన వారు 95 క‌లిపి మొత్తం 645 మందికి టీకాలు ఇచ్చారు. కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌లో కోవాక్జిన్ సెకండ్ డోస్ 9 మంది, కోవీషీల్డ్ సెకండ్ డోస్ 8 మంది తీసుకున్నారు.

రోజు కిట‌కిట‌లాడిన పీజేఆర్ స్టేడియం ప‌క‌డ్భందీ చ‌ర్య‌ల‌తో ఏడ‌వ రోజు వెల‌వెలబోతున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here