తెలంగాణ వ్యాక్సిన్‌ హ‌బ్‌గా మారింది… గ‌చ్చిబౌలి టిమ్స్ సంద‌ర్శ‌న‌లో మంత్రి కేటీఆర్‌…

న‌మస్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి టిమ్స్ ద‌వాఖానాను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిప‌ల్ శాఖ‌మంత్రి కేటీఆర్ సంద‌ర్శించారు. హైసియా, మైక్రోసాఫ్ట్, క్వాల్కం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాగ్నిజెంట్, వెల్స్ ఫార్గో సంస్థల ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్‌ను కేటీఆర్ శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా రెండు దశల్లోను ఐటి సంస్థలు వారి ఉదారత‌ను చాటుకున్నాయ‌ని అన్నారు. తమ వంతుగా సాధ్యమైనంత సేవ చేసేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. 150 పడకల ఐసీయూ సెంటర్ ను టిమ్స్‌ ఆసుపత్రి లో ఈ రోజు ప్రాంభించుకోవడం అభినంద‌నీయ‌మ‌న్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తుందని, వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్ల కోసం టెండర్లను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే వ్యాక్సినేషన్ ఉత్పత్తి కొనసాగుతుందని, ప్రతి రోజు డోసుల ఉత్పత్తి జరుగుతుందన్నారు. తెలంగాణ‌ వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ సంస్థలు రాష్ట్రానికి అందించే సహకారంపై చర్చిస్తున్నామన్నారు. ప్ర‌భుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తమ నియోజ‌క‌వ‌ర్గంలో ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు విస్తృతంగా కొన‌సాగ‌డం ఎంతో సంతృప్తిని క‌లిగిస్తుంద‌ని అన్నారు. అనంత‌రం సెక్టార్ థెరపీయూటిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అంద‌జేసిన రూ.15 ల‌క్ష‌ల చెక్‌ను రమేష్ పంచాంగులతో క‌ల‌సి ప్ర‌భుత్వ విప్ గాంధీ మంత్రి కేటీఆర్‌కు అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, టిమ్స్‌ డైరెక్టర్ విమల థామస్, డీఎంఈ రమేష్ రెడ్డి, సైబ‌రాబాద్ పోలీస్ కమిషనర్ స‌జ్జ‌నార్‌, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జ‌యేశ్ రంజ‌న్, రంగారెడ్డి జిల్లా ఆడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ వెంకన్న, టిమ్స్ సూప‌రింటెండెంట్ ఈషాన్ అహ్మ‌ద్ ఖాన్‌, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిమ్స్‌లో రోగుల‌ను ప‌రామర్శిస్తున్న మంత్రి కేటీఆర్‌, ప్ర‌భుత్వ విప్ గాంధీ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here