శిల్పాఎన్‌క్లేవ్ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో హ‌నుమాన్ జ‌యంతి ప్ర‌త్యేక పూజ‌లు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందాన‌గ‌ర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శార‌దా పీఠ‌పాలిత‌ శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు వేదుల ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ బృదం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీకార్యసిద్ధి ఆంజనేయస్వామికి విశేష మన్యుసూక్త పంచామృతాభిషేకములు, ఆకుపూజ, శ్రీ మన్యుపాశుపత హోమం త‌దిత‌ర ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వ‌డ‌మాల‌లు, అరటి గెల‌ల ఆలంక‌ర‌ణ‌తో స్వామి వారు భ‌క్తుల‌ను ఆక‌ట్టుకున్నారు. అదేవిధంగా అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని సాయిబాబా దేవాల‌యంలోను హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ధానార్చ‌కులు ముర‌ళీధ‌ర శ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. క‌రోనా సెకండ్ వేవ్‌, లాక్‌డౌన్ నేప‌థ్యంలో పురోహితులు, ఆల‌య క‌మిటి స‌భ్యులు మాత్ర‌మే పాల్గొని వేడుక‌లు నిర్వ‌హించారు.

అన్న‌పూర్ణ ఎన్‌క్లేవ్‌లోని సాయిబాబా దేవాల‌యంలో వ‌డ‌మాల‌లు, అర‌టి గెల‌ల అలంక‌ర‌ణ‌లో ఆక‌ట్టుకుంటున్న‌ ఆంజ‌నేయ స్వామి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here