టిమ్స్ ద‌వాఖానా వ‌ద్ద హెచ్‌సీయూ ఏబీవీపీ భోజ‌నం పంపిణీ శిబిరం… హాజ‌రైన ఆర్‌కేవై టీం స‌భ్యులు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలిలోని టిమ్స్ ద‌వాఖానా వ‌ద్ద హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఏబీవీపీ ఆద్వర్యంలో శ‌నివారం భోజ‌నం పంపిణీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌కేవై టీం ప్రతినిధులు పాల్గొని టిమ్స్ వ‌ద్ద వేచి ఉన్న రోగుల బంధువులకు, సిబ్బందికి, స్థానిక నిరుపేద‌ల‌కు భోజ‌నం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌కేవై టీం కార్య‌ద‌ర్శి గుండె గ‌ణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఏబీవీపీ తెలంగాణ వ్యాప్తంగా ఐదురోజుల పాటు నిర్వ‌హిస్తున్న మేగా స‌ర్వీస్ డ్రైవ్‌లో భాగంగా టిమ్స్ వ‌ద్ద భోజ‌నం పంపిణీ చేప‌ట్ట‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో అభాగ్యుల ఆక‌లి తీర్చేందేకు ఏబీవీపీ విద్యార్థి సంఘం నేత‌ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆర్‌కేవై టీం త‌ర‌పున తాము నిరంత‌రంగా భోజ‌నం, నిత్యావ‌స‌రాల పంపిణీ చేప‌డుతున్నామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏబీవీపీ నాయ‌కులు క‌ర్ణీ సింగ్‌, ఫ‌ణి కృష్ణ‌, యోగి, భ‌వ‌న్, ఆర్‌కేవై టీం ప్ర‌తినిధిలు వై.వినోద్ యాద‌వ్‌, ఆకుల ల‌క్ష్మ‌న్ ముదిరాజ్‌, జాజీరావు, మ‌న్నె ర‌మేష్‌, గ‌డ్డం శ్రీకాంత్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయ‌కుల‌తో క‌ల‌సి భోజ‌నం పంపిణీ చేస్తున్న ఆర్‌కేవై టీం ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి గుండె గ‌ణేష్ ముదిరాజ్‌, వినోద్ యాద‌వ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here