నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృ శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెయిన్ బో హాస్పిటల్స్ పర్యవేక్షణలో కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన స్వీయ వ్యాక్సినేషన్ సెంటరను స్థానిక కార్పొరేటర్లు వి.జగదీశ్వర్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలసి ప్రభుత్వ విప్, శేరిలింగంసల్లి శాసనసభ్యులు అరేకపూడి గాంధీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాతృశ్రీనగర్ అసోసియేషన్ వారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారని, రెయిన్‌బో ఆసుపత్రి సహకారంతో వ్యాక్సినేషన్ సెంటర్‌ణు ఏర్పాటు చేసుకోవడం అభినదించ దగ్గ విషయమని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మాతృశ్రీ వాసులకు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని కాలనీ వాసులందరు సద్వినియోగ పర్చుకోవలని పిలుపునిచ్చారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు నివసించే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ లలో ఇలాంటి ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల త్వరిత గతిన వ్యాక్సిన్ దక్కుతుందని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలపై కొంతమేర ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే నిర్లక్షం తగదని, టీకాలు తీసుకున్న వారు సైతం విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ కావూరి, మాజీ అధ్యక్షులు కన్నయ్య నాయుడు, సభ్యులు నాగరాజ్, రవి, వాసు, చందన కుమార్, పవన్, సతీష్, విజయ్, భాస్కర్ రెడ్డి, గోపి, సీతయ్య, డాక్టర్ రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.