శేరిలింగంపల్లి, ఆగస్టు 16 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నై నుంచి వచ్చిన భరతనాట్య కళాకారిణి రవళి మ్యాలవరపు తన నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాధవ పంచకం, నగుమోము, స్మరసుందరాంగుని, బృందావని తిల్లాన తదితర అంశాలను ఆమె ప్రదర్శించారు. అనంతరం ఆర్ఆర్ కూచిపూడి డాన్స్ అకాడమీ గురువు ఉమాదేవి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది. మూషిక వాహన, వందేవని భావన, భో శంభో, సిరుత నవ్వులవాడు, బాలకనకయ్య, రామాయణ శబ్దం, జనుత శబ్దం, బ్రహ్మాంజలి తదితర అంశాలను కళాకారులు హరిణి, పల్లవి, వేదశ్రీ, స్ఫూర్తి, హర్షిత, అదితి, లాలోయిత, ప్రసూనా, కిరణ్మయి, దీప్తిక, గాయత్రీ, సింధు తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. కార్యక్రమంలో ప్రముఖ నాట్య గురువు డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ శేషుబాబు, కృష్ణప్రియ, రజిని మల్లాది తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు. నృత్య ప్రదర్శనలతో శిల్పారామం ప్రాంగణం కళాభిమానులతో సందడిగా మారింది.






