ఇది పేదోళ్ల ప్ర‌భుత్వం కాదు, పెద్దోళ్ల ప్ర‌భుత్వం: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ బాధితులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంద‌ని తెలుపుతూ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డివిజన్ల వారీగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తర‌లివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మర‌ల్చడానికి ఎన్నెన్నో నాటకాలు ఆడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తూ పేదల ఇండ్లను కూలుస్తూ వారు కన్న కలలను కాల రాస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం కాదని, పెద్దోళ్ల‌ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, ఎల్లేష్, రమేష్, వసంత్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, ఆంజనేయులు సాగర్, శ్రీనివాస్, నరసింహ చారి, నర్సింగ్ యాదవ్, సురేష్ ,రాజు, ఆంజనేయులు యాదవ్, రమణయ్య, అజిత్ పాల్గొన్నారు.

ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి త‌ర‌లివెళ్తున్న ర‌వికుమార్ యాద‌వ్‌, నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here