సీఎం రిలీఫ్ ఫండ్ స‌హాయం అంద‌జేత

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.1.20 ల‌క్ష‌ల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ఆప‌ద‌లో ఉన్న పేద‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తుంద‌ని, ఈ స‌దుపాయాన్ని పేద‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బ్రిక్ శ్రీనివాస్, సంజీవ రెడ్డి, పోతుల రాజేందర్ , MD ఇబ్రహీం, సాంబయ్య, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి,మనోజ్, వెంకటేశ్వర రెడ్డి, దేవా, హరిప్రకాష్, వెంకట రాంబాబు, బాలరాజు, వెంకటేశ్వరరావు, సంఘం మహేష్, యాదగిరి త‌దితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అంద‌జేస్తున్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here