శేరిలింగంపల్లి, జూన్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వ 11 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలు, సంక్షేమం గురించి బస్తీలు, కాలనీలలో పర్యటించి ప్రజలకు వివరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. పార్టీ పదవులలో నియమితులైన ప్రతి ఒక్కరు డివిజన్ సమస్యలపై పోరాడుతూ అందరినీ కలుపుకుపోతూ పార్టీ బలోపేతానికి తోడ్పడాలని సూచించారు. మియాపూర్ డివిజన్ ఆర్డీఆర్ కాంప్లెక్స్ వద్ద మియాపూర్ డివిజన్ ప్రభారి మణిభూషణ్, కంటెస్టెంట్ కార్పొరేటర్, నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, డివిజన్ అధ్యక్షుడు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ నూతన కార్యవర్గం ప్రకటన, వికసిత్ భారత్ లక్ష్యంపై కార్యశాల కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని నియమితులైన వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ డివిజన్ లో పదవులు చేపట్టిన ఉపాధ్యక్షులు సురేష్, శివరాజ్, అంజయ్య , ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ , ప్రసాద్, కార్యదర్శులు పద్మ, ముకేశ్, పాపయ్య , ప్రసాద్, కోశాధికారి డేవిడ్ కి, బాధ్యతలు చేపట్టిన డివిజన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలో అధికారాన్ని చేపట్టి 11 ఏళ్ల పాలన పూర్తైన నేపథ్యంలో ప్రతి బూత్ లో కార్యకర్తలు పర్యటించి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి కాలనీ, బస్తీలలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో జరగబోయే జిహెచ్ఎంసి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు మాణిక్ రావు, సీనియర్ నాయకులు నాగేశ్వర్ గౌడ్, ఆకుల మహేష్, మనోహర్, వికసిత భారత్ కో కన్వీనర్ స్రవంతి, నరసింహ రాజు, గణేష్, పట్టాభిరాం, విజయేందర్ , కిరణ్ కుమార్ రెడ్డి, కుమార స్వామి, వినితా పాండే, శ్రీశైలం కురుమ, రవి గౌడ్, రాము, చందు, శ్రీను, రాఘవేంద్ర, మన్యం, రెడ్డమ్మ, ఆంజనేయులు, భాషా శివా , డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.