చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ స్వచ్చంధ సంస్థ సేవలు అభినందనీయం – ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పేద, మధ్య తరగతి ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోని పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా కృషి చేస్తున్న చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ స్వచ్చంధ సంస్థ ఔదార్యం చాలా గొప్పదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ లో చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో హ్యాండ్ వాష్ పరికరాలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

ఎంఏ నగర్ లో హ్యాండ్ వాష్ ట్యాంకర్లను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాందీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

చిన్న పిల్లలు వారి కుటుంబ సభ్యులు చేతులు శుభ్రం చేసుకోవడానికి వీలుగా తయారు చేసిన పరికరాలను చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీటిని చక్కగా సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఎంఏ నగర్ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని, మా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు మల్లేష్, రవి గౌడ్, రాజు గౌడ్, శివ ముదిరాజ్, వెంకటేష్, విజయ్, చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు, సీనియర్ ఆఫీసర్ ఎం.శ్రీశైలం, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.ప్రకాష్, ఫీల్డ్ కో ఆర్డినేటర్ దివ్య, కమ్యూనిటీ మొబిలైజర్ వి.తుల్జారామ్ తదితరులు పాల్గొన్నారు.

చైల్డ్ ఫండ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ తయారు చేసిన హ్యాండ్ వాష్ ట్యాంకర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here