జిల్లా అధ్యక్షునిపై‌ టీఆర్ఎస్ దాడి అహేతుకం: బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్దన్ గౌడ్ – కవిత దిష్టి బొమ్మను దగ్దం చేసిన బిజెపి‌ నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పై టీఆర్ఎస్ గుండాలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అన్నారు.‌ జిల్లా బిజెపి అధ్యక్షుడు సామ రంగారెడ్డి పై టీఆర్ఎస్ గుండాల దాడికి నిరసనగా చింతకింది గోవర్దన్ గౌడ్ ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మను మియాపూర్ సిగ్నల్ వద్ద కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్దన్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించినట్లు చెప్పారు. తప్పును ఒప్పుకోని సిగ్గులేని టీఆర్ఎస్ గుండాలు బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పై దాడిచేసి విచక్షణ రహితంగా కొట్టడం దారుణమన్నారు. కేసీఆర్ కుటుంబం కబ్జాలకు, లూటీలకు, దోపిడీలకు, స్కాంలకు పెట్టింది పేరని, తప్పు చేసిన కవితని వదిలేసి శాంతియుతంగా దీక్ష చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్రమాలను అడిగిన సామ రంగారెడ్డిపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేసి కొట్టడం కేసీఆర్ రజాకార్ బుద్ధికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.

మియాపూర్ చౌరస్తాలో చింతకింది గోవర్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న బిజెపి నాయకులు

ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ సమయం లో మీరు చేసిన ముట్టడులు అధికారం లోకి రాగానే మరిచారా అని, మీరు చేస్తే ఉద్యమం బిజెపి చేస్తే హత్యాయత్నమా అని చురకలు అంటించారు. బిజెపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బుచ్చి రెడ్డి, డీ యస్ ఆర్ కే ప్రసాద్, బొబ్బ నవత రెడ్డి, సుర్ణ శ్రీశైలం, మానిక్ రావు, శ్రీధర్ రావు, రాజు శెట్టి కురుమ, ఆంజనేయులు, జీ. రాంరెడ్డి, నర్సింగ్ రావు, శాంతి భూషణ్ రెడ్డి, సైఫుల్ల ఖాన్, కే. జితేందర్, లక్ష్మణ్ ముదిరాజ్, నరేష్ ముదిరాజ్, రత్న కుమార్, రవి గౌడ్, విజేందర్ సింగ్ అన్ని డివిజన్ ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here