నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పెట్, చందానగర్, భారతి నగర్ డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ. 29.3 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో 29 మంది లబ్దిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, పూజితజగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం యాదవ్, లక్ష్మా రెడ్డి, నల్లా సంజీవ రెడ్డి, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.