బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం -మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థుల విద్యాబ్యాసం కోసం 13 సంవత్సరాలుగా బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలవడం అభినందనీయమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ లోని వేముకుంట ప్రభుత్య ఉర్దూ, తెలుగు మీడియం పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థిని, విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 80 వేల విలువ చేసే నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్కేళ్లు, రబ్బర్లు తదితర వస్తువులను చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు కనీస మౌలిక వసతుల కల్పనలో భాగంగా నోట్ బుక్స్, తదితర వస్తువులను పంపిణీ చేయడం పట్ల బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ రెడ్డిని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు.

వేముకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి మాట్లాడుతూ పేద పిల్లలు ఇబ్బందులు లేకుండా విద్యను అభ్యసించాలన్నదే తన లక్ష్యం అని, గత 13సంవత్సరాలుగా బొబ్బ ట్రస్ట్ ద్వారా విద్యాబ్యాసానికి సహాయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల యోగనంద్, మువ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, నరేష్, బుచ్చి రెడ్డి, వసంత్ కుమార్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్, జితేందర్, కాంచన, రాకేష్ దూబే, కసిరెడ్డి రఘు, రాంరెడ్డి, హరికృష్ణ, నరేందర్ రెడ్డి, రాజు శెట్టి, పంతం నాగ రాజు, కళ్యాణ్, లలిత, శివ వర్మ, గౌస్, రమణ కుమారి, పోచయ్య, అనంత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వేముకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here