ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన అందిస్తున్నామని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల దిశ-దశా మారిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో ఆంగ్ల తెలుగు నిఘంటువు (డిక్షనరీ)లను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిఘంటువుల ద్వారా విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని అన్నారు. నిఘంటువులు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఆంగ్ల బాషా ప్రావీణ్యంలో మంచి పట్టు సాధించాలని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో దశ దిశ మారుతుందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు చింతకింది రవీందర్ గౌడ్, రాగం అనిరుద్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్, కొండల్ రెడ్డి, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణయ్య, కార్తిక్ గౌడ్, నరేందర్ బల్ల, గోపాల్ యాదవ్, బసవయ్య, రాంచందర్, నర్సింహ, రాజశేఖర్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రవి యాదవ్, లక్ష్మణ్ యాదవ్, వార్డు మెంబర్ శ్రీకళ, పర్వీన్ బేగం, బసవరాజు లింగాయత్, పట్లోల నరసింహ, సాయి, రమేష్, సత్తార్ బాయ్, దివాకర్ రెడ్డి, హలీం, కుమారి, రజిని, దీప, దీవెన, సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల నిఘంటువులను అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here