విద్యా వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించాలి – వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి: నూతన జాతీయ విద్యావిధానం ఎన్ ఈ పి 2020ను రద్దు చేయాలని, విద్యా వ్యాపారీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకిస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మురళి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బి. శంకర్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ కాలేజీల బంద్ పిలుపులో భాగంగా శేరిలింగంపల్లిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా కాషాయికరణలో భాగంగానే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యార్థుల బస్ పాస్ చార్జీలను తగ్గించి, విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాస్ లు అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా నేటికి ప్రభుత్య పాఠశాలల్లో విద్యార్థులకు 40 శాతం పాఠ్య పుస్తకాలు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు‌.

పాఠశాలలను బంద్ చేయిస్తున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్ డీఎస్

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, మన ఊరు- మనబడి ప్రణాళికలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను పథకంలో చేర్చి పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. ఖాళీలుగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో తొలగించిన 28 వేల మంది పారిశుద్య కార్మికులను వెంటనే తిరిగి నియమించుకోవాలని కోరారు‌. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, ఎన్నికల హామీల్లో ఇచ్చిన కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ శిరీష, ఎస్ ఎఫ్ ఐ హెచ్ సీ యూ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ధ్యాన్, శివ, హెచ్ నాయకులు ఆర్చిమోన, కృపా దివాకర్, వివేక్, ఆతిక్, ప్రజాతంత్ర భాద్యులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here