రాష్ట్రంలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్రం పెద్ద పీట – మాజీ ఎంపీ‌ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్యం పెద్ద పీట వేస్తుందని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బీహెచ్ఈఎల్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 130.65 కోట్ల నిధులు మంజూరు చేయడం‌ పట్ల శేరిలింగంపల్లి బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చందానగర్ లోని గాంధీ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి నితిన్‌ గడ్కరీకి మాజీ ఎంపీ కొండా‌ విశ్వేశ్వర్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో జాతీయ రహదాది 65 బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద 1.65 కి.మీ ప్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 130.65 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేస్తున్న బిజెపి‌‌ నాయకులు

తెలంగాణ రాష్ట్రం లో రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి పెద్దపేట వేయటంతో పాటు తెలంగాణ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్యం లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్యం పదే పదే కేంద్ర ప్రభుత్వంపై విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం‌ అని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తుందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. చందానగర్ డివిజన్ బిజెపి కమిటీ అధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గజ్జల యోగానంద్, మువ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, డాక్టర్ నరేష్, చింతకింది గోవర్ధన్ గౌడ్, బుచ్చి రెడ్డి, మహిపాల్ రెడ్డి, కాంచన కృష్ణ, రాజు శెట్టి, శ్రీధర్ గౌడ్, హరికృష్ణ, రాధ కృష్ణ యాదవ్, రాకేష్ దూబే, కసిరెడ్డి రఘునాధ్ రెడ్డి, జితేందర్, వసంత కుమార్ యాదవ్, నరేందర్ రెడ్డి, వేణుగోపాల్, శోభ దూబే, లలిత రాజపుట్, శివ వర్మ, శ్రీను, రమణ కుమారి, గౌస్, అనంత రెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here