శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని BK ఎన్‌క్లేవ్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… BK ఎన్‌క్లేవ్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను కాలనీ వాసులతో కలసి పరిశీలించడం జరిగిందని కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తిలో డ్రైనేజీ, మంజీరా మంచినీటి కొరత వంటి తదితర సమస్యలపై అప్రమత్తంగా ఉంటామని, ప్రతికాలనీలలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో BK ఎన్‌క్లేవ్ కాలనీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, కాలనీ వాసులు ప్రతాప్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, లింగమూర్తి రాజు, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
