శేరిలింగంపల్లి, జనవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ పరిధిలోని గౌతమినగర్ కాలనీలో ఉన్న పార్కును అభివృద్ధి చేయాలని కోరుతూ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సర్కిల్ ఉపకమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కులో పలు సదుపాయాలను కల్పించాలని కోరారు. ముఖ్యంగా పార్కులో వాకింగ్ ట్రాక్ దెబ్బ తిన్నదని, దానికి మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే కంకరతో గ్రౌండ్‌ను లెవలింగ్ చేయాలని, మొక్కలు పెంచేందుకు ఎర్ర మట్టిని ఏర్పాటు చేయాలని, సందర్శకులు కూర్చునేందుకు బెంచిలను ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్ బార్డర్‌లకు పెయింటింగ్ వేయాలని, అలాగే కాంపౌండ్ వాల్, ఎంట్రన్స్ గేట్‌కు సైతం పెయింట్ వేయాలని, ఇంకుడు గుంతను నిర్మించాలని, మొక్కల సంరక్షణకు వలలను ఏర్పాటు చేయాలని, సూచన, హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, అధ్యక్షుడు నూనె సురేందర్, ప్రధాన కార్యదర్శి బాదం సాయిబాబు, కోశాధికారి కేవీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
