నిరుపేదల కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా చేపట్టిన సన్నబియ్యం పథకంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, DSO శ్రీనివాస్, ASO పుల్లయ్య, DM గోపి కృష్ణ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ప్రతి పేదవారికి పట్టెడన్నం పెట్టాలన్న ఆలోచనతో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింద‌ని, నిరుపేదల కడుపు నింపడమే ప్రభుత్వ ధ్యేయం అని, ఆకలితో అలమ‌టించే పేదవాడికి సన్న బియ్యం అందించడం ద్వారా ఎంతో పుణ్యం కలుగుతుంద‌ని, రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ఆరు కిలోల సన్నబియ్యం అందచేయడం జరుగుతుంద‌ని తెలిపారు. అందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here