శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేపట్టిన బీసీ పోరు గర్జన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, నాయకులు,కార్యకర్తలతో కలిసి జంతర్ మంతర్ వద్ద బీసీ పోరు గర్జన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కూడా ఆమోదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్, సయ్యద్ గౌస్, గిరి, అభిషేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.