శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల పక్షపాతి అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా 200 మంది మైనారిటీ మహిళలకు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా పథకం కింద మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందచేయడం చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. పేద మహిళల జీవితాలలో వెలుగులు నింపిన రోజు అని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు తమ సొంత కాళ్ళ పై నిలబడి కుటుంబ పోషణకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుటుంన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ రీజినల్ ఆఫీసర్ కులకర్ణి, AGM పాసరి, షాజియా బేగం, నజియా బేగం, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు , మహిళలు పాల్గొన్నారు.





