శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో ఉన్న శ్రీ లక్ష్మీగణపతి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ సువర్చల హనుమత్ కల్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఇందులో పరిసర ప్రాంత వాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.






