ప్ర‌జా సంక్షేమం కోసం ప‌నిచేసే బీజేపీని గెలిపించండి: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలను మోసం చేసే పార్టీకి కాదు, ప్రజల సంక్షేమానికి పనిచేసే బీజేపీని గెలిపించాల‌ని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో కలిసి షేక్ పేట్ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. యువతకు ఉద్యోగాలు, గృహ నిర్మాణ హామీలు, మహిళలకు భద్రత వంటి అంశాల్లో పూర్తిగా వైఫల్యం చెందింద‌ని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా కేవలం రాజకీయ లాభాల కోసమే నడిచే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పాల‌ని అన్నారు.

పన్నెండేళ్లుగా ఇరు పార్టీలను నమ్మి ప్రజలు ఓటు వేసినా నాయకులు మాత్రమే సంపన్నులై సుఖంగా ఉన్నారని, కానీ జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీలకు చరమగీతం పాడి, అభివృద్ధి చేయగలిగే మోదీ పాలనను జూబ్లీహిల్స్‌కు అందించేందుకు బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికలో ప్రజల జీవితాలకు భరోసానిచ్చిన బీజేపీకి మద్దతు తెలుపుతూ, 1వ నంబర్ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ రాందీన్, షేక్ పేట్ డివిజన్ అధ్యక్షుడు రాకేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్, రాష్ట్ర నాయకులు వసంత కుమార్ యాదవ్, స్వామి గౌడ్, సురేందర్, అనిల్ గౌడ్, వరలక్ష్మి ధీరజ్, బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంజీవ్, దయాకర్, అరుణ్ గౌడ్, సురేష్, శేఖర్, దుర్గా రామ్, శ్యామ్ యాదవ్, దినేష్ యాదవ్, విజయ్, రాఘవేంద్ర, స్థానిక బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here