ఏపీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని భారాస సీనియర్ నాయకుడు, శేరిలింగంపల్లి ఉద్యమ నేత చిర్రా రవీందర్ యాదవ్ కలిశారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని అందించారు. ఫోటో ఫ్రేమ్ ను చూసి చాలా బాగుందని కితాబిచ్చారు. అనంతరం చిర్రా రవీందర్ యాదవ్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. శేరిలింగంపల్లిలో నిర్వహిస్తున్న భారాస పార్టీ కార్యక్రమాల తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే తన సొంత ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విధానం బాగుందని ప్రశంసలు కురిపించారు. మరోవైపు చిర్రా రవీందర్ యాదవ్ శేరిలింగంపల్లి నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తుండటంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తన మద్దతు ఉంటుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారని తెలిపారు. పోటీకి సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్ తెలిపారని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి రానున్నట్లుగా పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులు జరగనున్నట్లుగా వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here