శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): డా.బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజాఫర్ అహ్మద్ నగర్ లో స్థానిక నాయకుడు టిప్పర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MBC చైర్మన్ జేరిపేటి జైపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు దేశంలో పేదలకు ఫలాలు అందుతున్నాయని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జేరిపేటి జైపాల్ పాల్గొని వడ్డన చేశారు.

అదేవిధంగా ముజాఫర్ అహ్మద్ నగర్ కాలనీ వాసులు, స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు దేశం సుభిక్షంగా ఉందన్నారు. సమ సమాజ స్థాపన, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని మరువలేమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో పయనించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో MBC చైర్మన్ జేరిపేటి జైపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే నేడు దేశంలో పేదలకు ఫలాలు అందుతున్నాయని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో జేరిపేటి జైపాల్ పాల్గొని అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కబీర్ కౌశల్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, ముజఫర్ హైమద్ నగర్ కాలనీ వాసులు, డప్పు రాములు, రాంబాబు, రాజేష్ గౌడ్, శ్రీధర్ ముదిరాజ్, దయానంద్ ముదిరాజ్,శివ, అవినాష్, అడ్డు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.