శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): భారతరత్న రాజ్యంగ నిర్మాత డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కవిరాజ్ తలారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు దేశం సుభిక్షంగా ఉందన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే అది అంబేద్కర్ చలువ వల్లే అన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో రాజకీయ నాయకులు నడవాలని, దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చాలా మంది బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు సరిగ్గా చేరడం లేదన్నారు. నేతలు అలాంటి వారిని గుర్తించి వారికి చేయూతను అందించాల్సిన అవసరం ఉందన్నారు.