మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు కోరారు. ఈ మేరకు వారు ఆయనను బుధవారం ఆయన కార్యాలయంలో కలిశారు. అనంతరం రెండు డివిజన్ల పరిధిలలో పెండింగ్‌లో ఉన్న పనులపై వారు చర్చించారు. అలాగే కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని వారు గాంధీని కోరారు. ఇందుకు గాంధీ సానుకూలంగా స్పందించారు. పనులను త్వరిత గతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశిస్తామన్నారు.
