కుల గ‌ణ‌న చేప‌ట్టిన ఘ‌న‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వానిదే: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి, మార్చి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన‌ కుల గణన బీసీలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలందరిపై ఉంద‌న్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ లో ఉన్న‌ అంబేద్కర్ విగ్రహానికి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రిజర్వేషన్ కమిటీ చైర్మన్ లు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మైనారిటీ నాయకులు షబ్బీర్ అలీ, ఫాయీమ్ క్కురీషి చిత్రపటాల‌కి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సంద‌ర్బంగా జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ.. పకడ్బందీగా కుల గణన పూర్తి చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వానికే దక్కుతుంద‌న్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలే పాటించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేసిన ఈ నిర్ణయం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నార‌న్నారు. ఎవ‌రూ అడ‌గ‌క ముందే త‌న బాధ్య‌త‌గా తీసుకున్న‌ రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఈ రిజ‌ర్వేష‌న్ల‌ క్రెడిట్ అంతా దక్కుతుంద‌ని తెలిపారు. బీసీ రిజర్వేషనల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంద‌ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు/ఎస్సీ వర్గికరణ చారిత్రాత్మకమని, చ‌రిత్ర‌లో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజ‌ని అన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినెటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, మహిపాల్ యాదవ్, వీరేశం గౌడ్, కట్ల శేఖర్ రెడ్డి, నరందేర్ గౌడ్, ఉరిటీ వెంకట్ రావు, మన్నెపల్లి సాంబశివరావు, సుదర్శన్, డివిజన్ అధ్యక్షులు అలీ, జహంగీర్, భరత్ గౌడ్, రేణుక, బాష్పక యాదగిరి, మరేళ్ల శ్రీనివాస్, డిసిసి ఉపాధ్యక్షులు సురేష్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, పట్వారీ శశిధర్, సౌందర్య రాజన్, యలమంచి ఉదయ్ కిరణ్, రవి కుమార్, ఓబీసీ నాయకులు హరికిషన్, రామచందర్, కంకారెడ్డి, సాయన్న, వెంకట్ నారాయణ, నర్సింగ్ రావు, దుర్గేష్, రాజా రెడ్డి, నవీన్ రెడ్డి, యాదయ్య గౌడ్, కార్తిక్ గౌడ్, ప్రణయ్ గౌడ్, సత్య రెడ్డి, కృష్ణ గౌడ్, నర్సింహ గౌడ్, హరనాథ్ గౌడ్, పరుశురాములు, యకయ్య, కుమార్ యాదవ్, యాదగిరి, మైనారిటీ చైర్మన్ అజీమ్, నాయకులు ఆయాజ్ ఖాన్, హనీఫ్, సయ్యద్ బాబా, గఫర్, ముజీబ్, ముక్రం, జావేద్, యూసుఫ్, మౌలానా, నజీర్, సాజిద్, పాషా, అశోక్, రాంబాబు, హరి, శ్రీను, నవీన్, పద్మ రావు, లక్ష్మణ్, మల్లేష్, కృష్ణ, ప్రసాద్ ముదిరాజ్, మల్లేష్, మహేష్, రాజేష్, మహిళలు కల్పన ఏకాంత్ గౌడ్, నళిని, ప్రియదర్శిని, పార్వతి, రాజలక్ష్మి, జయ, శాంత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here