శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడని అన్నారు. ఆయన తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశారన్నారు. ఆయన నాయకత్వంలో మన సమాజం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసిందని, ఆయన పేద ప్రజల కోసం అహర్నిశలు తపనపడే వ్యక్తి అని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులను ఎన్నింటినో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వసంత్ యాదవ్, వెంకటస్వామి రెడ్డి, నరసింహ చారి, యాదవ రెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, రాయల్, సత్యనారాయణ, శివరాజ్, విజేందర్, పట్టాభిరామ్, ప్రభాకర్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.