దళిత బంధు పథకంతో ఆత్మగౌరవం – లబ్దిదారులకు యూనిట్లను అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా దళితుల్లో ఆత్మగౌరవం మరింత పెరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. దళిత బంధు పథకం ద్వారా కుమార్ కు మంజూరైన టెంట్ హౌజ్ ను చందానగర్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఫేస్ 2 లో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత‌బంధు పథకం ద్వారా రూ. 10 లక్షలు మంజూరు చేస్తూ లబ్దిదారులకు ఇష్టమైన వ్యాపారాలకు సంబంధించి యూనిట్లను అందజేస్తున్నారని అన్నారు. దళిత బంధు పథకం దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టలేదని, ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. దళితుల్లో నెలకొన్న అభద్రతాబావం రూపుమాపి ఆర్థికంగా, సామాజిక సాధికారత సాధించే లక్ష్యంగా దళితబంధు పథకం ఉందన్నారు.

దళితబంధు పథకం ద్వారా కుమార్ కు మంజూరైన టెంట్ హౌజ్ ను ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ‌గాంధీ, కార్పొరేటర్లు

అంతకుముందు మియాపూర్ డివిజన్ పరిధిలోని బీకే ఎన్ క్లేవ్ కాలనీ కి చెందిన జేమ్స్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఫొటో స్టూడియోకి సంబంధించి కెమెరా, ఇతర పరికరాలను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద ఉపాధి అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ ‌కు, సహకరించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి లబ్దిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ పురుషోత్తం యాదవ్, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మిరియాల రాఘవ రావు, ఉరిటీ వెంకట్రావు, చింతకింది రవీందర్ గౌడ్, కొండల్ రెడ్డి, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, రమణయ్య, కార్తిక్ గౌడ్, నరేందర్ బల్ల, గోపాల్ యాదవ్, రాంచందర్, నర్సింహ, రాజశేఖర్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, రజిని, చంద్రకళ, జయమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కెమెరాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here