శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష హిల్స్ గేట్ నంబర్ 1 వద్ద నిర్మాణంలో ఉన్న ఓ సెల్లార్ గుంత ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని, వెంటనే బిల్డర్‌పై చర్యలు తీసుకుని సెల్లార్ గుంతను పూడ్చేలా చూడాలని BRS పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు, ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జోనల్ కమిషనర్‌ను ప్రశ్నించారు. సదరు సెల్లార్ గుంతను తవ్వి సంవత్సరం కావస్తుందని, అయినా ఇప్పటికీ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని అన్నారు. ఈ గుంత ఉన్న రోడ్డు 30 ఫీట్లు ఉండేదని, ఇప్పుడది 15 ఫీట్లకు కుచించుకు పోయిందని అన్నారు. సెల్లార్ గుంత చుట్టూ ఒక ఆకుపచ్చ వస్త్రాన్ని కట్టారని, అందువల్ల పక్కనే ఉన్న రహదారిపై ప్రయాణించే వారికి పక్కనే సెల్లార్ గుంత ఉన్న విషయం తెలియదని అన్నారు. ఆ రహదారిపై నిత్యం ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారని, ఈ క్రమంలో వాహనదారులు గుంతలో పడిపోయే ప్రమాదం ఉందని, కనుక ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.