శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ అన్నారు. 6 గ్యారంటీలు 66 పథకాలు 420 హామీలు వీటితోనే కాలయాపన చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, గతంలో టిఆర్ఎస్ ఏ విధంగా అయితే చేసిందో అదే బాటలో నడుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పదే పదే మోసం చేయబోతుందని అన్నారు.కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పేదలకు ఇల్లు ఇవ్వడం జరిగిందని, కేంద్రం బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందని, మళ్లీ మళ్లీ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొద్దామని ప్రజలు చూస్తున్నారని అన్నారు.