శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఆరెకపూడి గాంధీ అభినందించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ జల వాయు విహార్ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యలపై స్పందిస్తూ ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జల వాయు విహార్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంజనేయ రాజు, సెక్రెటరీ PV రావు, ట్రెజరర్ రామరాజు, కమిటీ మెంబర్ వెంకటేశం, కాలనీ వాసులు కృష్ణం రాజు, రామకృష్ణ రాజు, ప్రభాకర్, కిరణ్ కుమార్ రాజు, గోపి చంద్ తదితరులు పాల్గొన్నారు.